-->
కాలంతో కలిసిపోని, పుస్తకాలలొ మగ్గిపోని,కొందరికి మాత్రమే పరిమితంకాని,భావకవిత్వపు సొగసుజూప జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.

ఇందులో

Read More ->>
అంటే ..
ఈ బ్లాగులోకొత్తగా ఏమీ ఉండవు..అలా  అని పాతగా కూడా ఉండవు.
కొన్ని  కవితలుంటాయి. కవితలకు పాత కొత్తలతో పనిలేదు. భావకవిత్వానికి అసలే లేదు.
నేను చదువుతున్న పుస్తకంలోవో , తె.వికీలోవో ఎక్కడో చోటవి కొన్ని "కృష్ణశాస్త్రి" కవితలు నాకర్ధమైన, మనసుకు నచ్చిన రీతిలో ఇక్కడుంటాయి. 

మేము చదువుకున్న రోజుల్లో ఏమన్నా "సందేహాలుంటే అడగండి" అంటూ మా మాస్టారు ఎప్పుడూ మమ్మల్ని అడుగుతూనే ఉండేవారు. అదేమిటో తెలీదు అప్పుడు చెప్పటానికి అయ్యవారున్నా, అడగటానికే ప్రశ్నలు తట్టేవికావు.
ఇప్పుడు ఎంతో తెలుసుకోవాలనున్నా చెప్పేవాళ్ళే లేకపోయారు.

చెప్పేవాళ్ళు లేరని ఎందుకు అనుకోవటం ?
ప్రయత్నిస్తే  దొరకనిది ఏదీ ఉండదు అంటారుగా ! , ఓసారి ప్రయత్నించి చూద్దాం. గూగుల్ ఉంది కదా ! అని ప్రయత్నించాను.ఫలితంగా  అంధ్రభారతి లాంటి నిఘంటువు, నాకంట పడింది. తెలుగుబ్లాగర్లగుంపులో మిత్రులు కూడా చాలా అమూల్యమైన సలహాల్ని, పుస్తకాల్ని సూచించారు.

నేను  తెలుసుకున్న అర్ధాలు, నేను నాకు చెప్పుకున్న,చెప్పుకుంటున్న భావాలు సరైనవేనా ?
ఈ ఆలోచనకి ప్రతి రూపనే ఈ బ్లాగు.

నా  మాటల్లో నాకు నచ్చిన కవిత ఎలా ఉంటుందనేదానికి అక్షరరూపాన్ని మీరిక్కడ చూడొచ్చు.
దానిలో ఒప్పులుంటాయి, తప్పులూ ఉంటాయి.అలా అని నేను తప్పుని పని గట్టుకుని ప్రసారం చెయ్యను. అసలు తప్పులే లేకుండా రాస్తాననీ నేను చెప్పలేను.  రాసేదాంట్లో నా తప్పుంటే చెప్పండి. తప్పక సరిదిద్దుకుంటాను.విశ్లేషణలకి, ప్రక్షాలనలకి నేను సర్వదా సిద్దం.   

కవి కృష్ణశాస్త్రిది తీరని తృష్ణ అయితే .. నాదికూడా అంతే ..
ఆయన  అంతులేని ప్రేమకోసం, అతన్ని ప్రేమించే .. అతను ప్రేమించిన ప్రపంచంకోసం వెతుకులాడాడు.
అదే  భావంతో, అదే  ప్రేమని అతని కవితల్లోంచి పొందటానికి నేను పాకులాడుతున్నాను.